పీవీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి
మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య
జీ న్యూస్ హుజురాబాద్
పీవీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అన్నారు.
హుజురాబాద్ పట్టణంలోని పీవి మార్గ్ వద్ద భారత రత్న పీవీ నర్సింహరావు 21 వ వర్థంతి కార్యక్రమాన్ని పీవీ సేవాసమితి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రంలో కమిషనర్ కేంసారపు సమ్మయ్య పాల్గొని పీవి విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని అభివృద్ది పథం వైపు నడిచేలా చేశారని కొనియాడారు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న సమయంలో అనేక ఆర్థిక సంస్కరణాలతో దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించారన్నారు. పీవి ఒక విజన్ గల నాయకుడని అయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలొ పీవి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు తూం వెంకట్ రెడ్డి, బత్తులమనోజ్, జనార్దన్, సందెల వెంకన్న, సదానందం, సాగి వీరభద్ర రావు, చిలుకమారి శ్రీనివాస్, కొండ గణేష్, మాజీ సర్పంచ్ సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు వెంకట్రాజం, ప్రభాకర్, సదానందం, సురేష్, శ్రీహరి, అంబరీష్, నారాయణ, ఖాలిద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..
