పీవీ ఆర్థిక సంస్కరణలతో ప్రగతి పథంలో భారతదేశం
పీవీ ఆర్థిక సంస్కరణలతో ప్రగతి పథంలో భారతదేశం
జీ న్యూస్ హుజూరాబాద్

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఎంతో దోహదపడ్డాయని పీవీ తనయుడు పీవీ ప్రభాకర్ రావు అన్నారు. హుజూరాబాద్ లోని సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద పీవీ సేవా సమితి, లయన్స్ క్లబ్ సంయుక్తంగా పీవీ విగ్రహం ఏర్పాటు చేయగా, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పీవి ప్రభాకర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వొడితల ప్రణవ్ లు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పీవి నరసింహారావు సంక్లిష్ట పరిస్థితులలో ప్రధానమంత్రిగా పనిచేశారన్నారు . ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక సంస్కరనల పలితంగానే ఇప్పుడు దేశం అభివృద్ది చెందిందన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ పీవీ నరసింహారావు ఎంతో ముందు చూపు గల నాయకుడని, దేశ సాంకేతిక శాస్త్రీయ ప్రగతికి పునాదులు వేశాడన్నారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు గారికి చదువు అంటే ఎంతో ఇష్టమన్నారు. విద్యారంగానికి అదిక ప్రాదాన్యతనిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో నవోదయ పాఠశాలలను ప్రారంభించాడన్నారు. పీవీ నరసింహారావు పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేస్తే మంచి ఉండేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్‌ను పీవి జిల్లాగా చేయడానికి తనవంత ప్రయత్నం, సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కే సమ్మయ్య, హుజూరాబాద్ మాజీ ఎంపీపీ సరోజినీ దేవి, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పీవీ మదన్మోహన్, నాయకులు నరేష్, రమేష్, విజయేందర్, పీవీ సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేతలు సిరిసిల్ల రాజయ్య, లింగారెడ్డి, ప్రముఖులు, స్నేహితులు, అనుచరులు, అభిమానులు, బంధువులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు కెప్టెన్ లక్ష్మీకాంతరావును సన్మానించారు. 