బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఓసీలు రాజకీయ కుట్రలు
జీ న్యూస్ లోకేశ్వరం డిసెంబర్ 20
బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఓసీలు రాజకీయ కుట్రలు చేస్తున్నారని ముధోల్ మున్నూరు కాపు బీసీ నాయకులు ఆరోపించారు. శనివారం బైంసా పట్టణంలోని తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముధోల్ తాలూకా గొల్లమాడ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో అవకతవకలు జరిగాయి అంటూ ఓసీ నాయకులు బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. కౌంటింగ్ సమయంలో అధికారుల సమక్షంలోనే విజేతను నిర్ణయించారని,మళ్లీ అవకతవకలు జరగాయని అనడం బీసీల ఐక్యతను దెబ్బతీయడానికే అన్నారు. సమావేశంలో బీసీ నాయకులు మల్లేష్, పోశెట్టి, సంజీవ్, నరసయ్య, దేవిదాస్ ఉన్నారు.
