ఎన్నికల నియమావళి పాటించాలి

Must read

ఎన్నికల నియమావళి పాటించాలి

ఎస్ఐ జి అశోక్

జీ న్యూస్  లోకేశ్వరం

మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామంలో పోలీసులు సూచించిన నియమాలను పాటించాలని లోకేశ్వరం ఎస్ఐ జి అశోక్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల 100, 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు గుమిగూడరాదని సూచించారు. సెల్ ఫోన్లు, వాటర్ బాటిల్స్,ఇంకు బాటిల్స్ వంటివి పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించబడవని,క్యూ పద్ధతిని పాటించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించినవారు లేదా ఓడినవారు, వారి అనుచరులు—ఎవరూ ప్రజా శాంతి భద్రతలను భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. విజయం-పరాజయాలను గౌరవప్రదంగా స్వీకరించాలన్నారు.   సోషల్ మీడియా ద్వారా అపప్రచారం, రెచ్చగొట్టే మెసేజ్‌లు, వదంతులు వ్యాప్తి చేయవద్దని సూచించారు. ప్రజా శాంతి భద్రతలను భంగం కలిగించే వ్యక్తులపై సంబంధిత చట్టపరమైన చర్యలు ఎటువంటి మినహాయింపు లేకుండా తీసుకోబడతాయన్నారు.

 

 

More articles

Latest article