అభివృద్ధి సేవలే తన లక్ష్యం గా…సర్పంచ్ బరిలోకి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్నం ఆలిమ చిరంజీవి .
జీ న్యూస్ దుగ్గొండి
ప్రజా సేవే లక్ష్యం గా.. గ్రామ అభివృద్ధి కోసం పోటీ చేస్తున్నానని, ప్రజల మద్దతుతో విజయం సాధించాబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్నం ఆలిమ చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కన్నం అలిమ మంగళవారం ప్రచారం నిర్వహించారు. తన ఉంగరం గుర్తుకు భారీ మద్దతు వస్తుందన్నారు. ప్రజల అభివృద్ధి, గ్రామ సమస్యల పరిష్కారం లక్ష్యంగా తీసుకొని ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశామన్నారు. లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థికి తమ పూర్తి మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు వినడం, పరిష్కారాలు చెప్పడం, అభివృద్ధి అజెండాను వివరించడం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. లక్ష్మీపురం గ్రామంలోని ప్రతి వాడకు, ప్రతి కుటుంబానికి అభివృద్ధి చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శుద్ధి నీరు, మంచి రోడ్లు, అభివృద్ధి, వీధి లైట్లు, డ్రైనేజ్ వంటి ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఒక్కో ఓటు మా గ్రామానికి దిశా నిర్దేశం అవుతుంది. ఉంగారం గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్‌గా గెలిపించండి అని ప్రజలను కోరారు. గ్రామానికి చేసిన సేవలు, అందరితో కలిసిపోయే స్వభావం, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే తీరు తనను గెలిపిస్తుందన్నారు.

