అయ్యప్ప శరణు ఘోషతో మారు మోగిన మహా పడిపూజ..
జీ న్యూస్ ముధోల్
ముధోల్ మండలం లోని బ్రాహ్మణ్ గావ్ గ్రామంలో మంగళవారం రెడ్డి సంఘంలో అయ్యప్ప మహపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన దేవరి అంజయ్య గురు స్వామి 18 సంవత్సరాలుగా మాలధారణ చేసిన నారికేళ గురుస్వామిని తోటి గురు స్వాములు,అయ్యప్ప స్వాములు ఘనంగా సత్కరించారు. ముందుగా గణవతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం,ప్రత్యేక పూజలను నవీపేట్ అయ్యప్ప ఆలయ అర్చకులు శశాంక్ జోషి గురుస్వామి కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మెట్ల పూజ లో అయ్యప్ప శరణు ఘోషతో మారు మోగింది.

.ఆర్కెస్ట్రా బృందం ఆలపించిన పాటలు, చిన్నారుల నృత్యాలు భక్తి పరవాశ్యం లో ముంచేత్తాయి. స్వాములు ఆనంద నృత్యాలు అలరింపజేశాయి. స్వామియే శరణం అయ్యప్ప..శరణం శరణం అయ్యప్ప శరణం.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో బ్రాహ్మణ్ గావ్ గ్రామం మార్మోగింది. కార్యక్రమంలో,వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, గ్రామ ఆడపడుచులు యువకులు పిల్లలు పాల్గొన్నారు.
