గ్రామాలను చిల్చుతున్న ఎన్ హెచ్ 563.

Must read

గ్రామాలను చిల్చుతున్న ఎన్ హెచ్ 563.

రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు.

జీ న్యూస్.హుజురాబాద్,

హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలో ఎన్  హెచ్563 బైపాస్ రోడ్డు వల్ల రాకపోకలు ఇబ్బందులుగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించి వారి ఆవేదనను వ్యక్తపరిచారు. . పెద్ద పాపయ్యపల్లి పల్లి రైతులు నరేడ్ల రాజిరెడ్డి, మూగల రాజిరెడ్డి మాట్లాడుతూ… నూతనంగా నిర్మిస్తున్న కరీంనగర్ నుండి వరంగల్ వెళ్లే ఎన్ హెచ్ 563 హైవే రోడ్డు వల్ల హుజురాబాద్ నుండి కనుకులగిద్ద కు వెళ్లే దారిలో వెహికల్ అండర్ పాస్ ఇవ్వకుండానే హైవే రోడ్డు నిర్మించారు. దీనివల్ల రాకపోకలు ఇబ్బందిగా మారాయని, ఎస్టి కాలనీలో మరియు రావులపల్లి కు వెళ్లే దారిలో కూడా అండర్ పాస్ లు ఇవ్వకుండానే రోడ్డు నిర్మిస్తున్నారన్నారు. ఇది నిర్మించడం వల్ల గ్రామాలకు వెళ్లాలంటే 8 ఫీట్ల రోడ్డు పై ఎక్కి దిగాల్సి వస్తుందని వాపోయారు. ఈ రోడ్డు నిర్మించిన తర్వాత పూర్తిగా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని,  ఈ సమస్య గురించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎంత వేడుకున్నా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నుండి ప్రాజెక్ట్ డైరెక్టర్ కి సూచనలు ఇప్పించిన పట్టించుకోలేదన్నారు. హైకోర్టులో  కేసు వేసినప్పటికీ అధికారులకు కోర్టు ఆదేశించిన దానిని మార్పులు చేర్పులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రశ్నించగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు రైతుల పై అక్రమ కేసులు పెట్టి రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు.  రైతుల ఆవేదనను  ప్రభుత్వం అర్థం చేసుకొని గ్రామాల మధ్యలో రాకపోకలు జరిగేలా, ట్రాక్టర్ వెళ్లేటట్టుగా కనీసం 8 ఫీట్ల ఎత్తుతో వెహికల్ అండర్ పాస్ వే లు నిర్మించి నీరు నిలవకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు రావుల సమ్మిరెడ్డి, సమ్మిరెడ్డి, పున్నం చందర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article