Ustaad Bhagat Singh | ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్స మూవీపై మేక‌ర్స్ కీల‌క అప్‌డేట్

Must read

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్‌కి సంబంధించి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కీలక అప్డేట్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది.

మైత్రీ మూవీ మేకర్స్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా తెలిపిన ప్రకారం – “ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం క్లైమాక్స్ భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. భావోద్వేగాలు, యాక్షన్‌తో కూడిన అద్భుతమైన కీ సీక్వెన్స్ నబకాంత్ మాస్టర్ పర్యవేక్షణలో చిత్రీకరించబడింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు, హరిహర వీరమల్లుపై ప్రమోషన్లతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ గారు పూర్తి అంకితభావంతో క్లైమాక్స్ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇది ఆయన కష్టపడి పనిచేసే తీరు మరియు సినిమాపై ప్రేమకు నిదర్శనం” అని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రాశీ ఖన్నా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన పవన్ – హరీశ్ శంకర్ కాంబో మళ్లీ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

More articles

Latest article