కిషన్​ రెడ్డికి క్లబ్​ సభ్యుల నివాళి

Must read

కిషన్​ రెడ్డికి క్లబ్​ సభ్యుల నివాళి

జీ న్యూస్​ హుజూరాబాద్​

ఇటీవల మృతి చెందిన హుజూరాబాద్​ క్లబ్​ సంయుక్త కార్యదర్శి చొల్లేటి కిషన్​ రెడ్డి కి క్లబ్​ సభ్యులు ఆదివారం  మౌనం పాటించి  ఘనంగా నివాళులర్పించారు.  క్లబ్​ ఆరవణలో  ఉదయం కిషన్​ రెడ్డి స్మారక  కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపి మాదవి మాట్లాడుతూ కిషన్​ రెడ్డి అందరితో కలివిడిగా ఉంటూ సందడి చేసేవారన్నారు. క్లబ్​ కార్యక్రమాలలో ఆయన చురుకుగా ఉండేవాడని, ఆయన లేని లోటు స్పంష్టంగా కనిపిస్తుందన్నారు. సభ్యులు మాట్లాడుతూ  కిషన్​ రెడ్డితో గడిపిన  జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.  తర తమ బేదాలు లేకుండా అందరిని కలుపుకుపోయి, అరమరికలు లేకుండా ఉండేవాడన్నారు. కిషన్ రెడ్డి ఉన్నంత సేపు లాఫింగ్​ క్లబ్​లా మారిపోయేదని, సందడిగా ఉండేదని గుర్తుకు చేసుకున్నారు. ఎవరికి చిన్న సమస్య వచ్చినా తాను మందుకు వచ్చి వారికి దైర్యం చెప్పి, అండగా ఉండేవాడన్నారు. ఎప్పుడూ  ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే కిషన్​ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.

More articles

Latest article